News January 31, 2025
నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.
Similar News
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
News November 15, 2025
సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


