News January 31, 2025

నీల్వాయి: అడవి పందిని వేటాడిన ముగ్గురి అరెస్టు

image

నీల్వాయి రేంజ్ పరిధిలోని కొత్తగూడెం సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి అడవి పందిని చంపిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపారు. నీల్వాయి గ్రామానికి చెందిన నర్వేల్లి మల్లయ్య, మంత్రి రాజన్న, గొర్లపల్లి గ్రామానికి చెందిన నికాడి నాగేష్ కొత్తగూడెం గ్రామానికి చెందిన నర్వెల్లి మల్లయ్య వరి పొలంలో విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి అడవి పందిని చంపినట్టు గుర్తించామన్నారు.

Similar News

News February 19, 2025

పమిడిముక్కలలో యాక్సిడెంట్.. యువతి మృతి

image

పమిడిముక్కల మండలం తాడంకి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి నర్రా లక్ష్మీ ప్రసన్న (20) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. మచిలీపట్నానికి చెందిన లక్ష్మీ ప్రసన్న తాడిగడపలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడి బైక్‌పై ఆమె మచిలీపట్నానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సీఐ చిట్టిబాబు కేసు నమోదు చేశారు.

News February 19, 2025

ఐరాల: మహిళా ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి దేహశుద్ధి

image

మహిళా బ్యాంకు ఉద్యోగులను వేధిస్తున్న వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. కాణిపాకంకు చెందిన భూపాల్ వైఎస్ గేటులో ఉన్న ఓ బ్యాంకులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులను చిత్తూరు నుంచి బస్సులో వస్తుండగా నిత్యం వేధిస్తున్నాడు. ఈ వేధింపులపై ఆగ్రహించిన స్థానికులు అతనిని కరెంటు స్తంభానికి కట్టి దేహశుద్ధి చేశారు.

News February 19, 2025

గన్‌తో బెదిరిస్తున్నారు: పీలేరు సర్పంచ్

image

పీలేరు ఈవో గురుమోహన్‌పై స్థానిక సర్పంచ్ హబీబ్ బాషా సంచలన ఆరోపణలు చేశారు. ఈవో అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా సమస్యలపై ప్రశ్నించిన వారికి తన వద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కార్మికులకు జీతాలు ఇవ్వకపోగా కొన్ని నెలలుగా వారికి ఈపీఎఫ్ డిపాజిట్ చేయలేదన్నారు. ఈవోపై చర్యలు తీసుకోవాలని కోరారు.

error: Content is protected !!