News February 9, 2025

నులిపురుగులపై అవగాహన కల్పించాలి: DEO

image

ఈనెల 10వ తేదీన జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేయాలని గుంటూరు డీఈవో సీవీ. రేణుక ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. నులి పురుగులపై అసెంబ్లీలో అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లు విద్యార్థులతో వేయించాలన్నారు. హాజరు కాని విద్యార్థులకు 17వ తేదీన ఇవ్వాలన్నారు. 

Similar News

News February 11, 2026

గుంటూరు: మహాశివరాత్రికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

image

మహాశివరాత్రి (ఫిబ్రవరి 15) సందర్భంగా జిల్లాలోని ప్రధాన శివాలయాలు, తిరునాళ్లు, నదీ తీర ప్రాంతాల్లో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 112/100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.

News February 11, 2026

పనివేళల్లోనే సర్వేలు చేయించాలి: కలెక్టర్

image

సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి లేకుండా, కేవలం పనివేళల్లోనే సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి MPDOలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ‘అక్షర ఆంధ్ర’, ‘యూనిఫైడ్ ఫ్యామిలీ’ సర్వేల పురోగతిని సమీక్షించారు. సిబ్బంది సేవలను సమతుల్యంగా వినియోగించుకోవాలని, సర్వేల నిర్వహణను పర్యవేక్షణ అధికారులు నిరంతరం మానిటర్ చేయాలని సూచించారు.

News February 11, 2026

GNT: శివరాత్రి ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శివాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత ఏడాది కంటే మెరుగ్గా ఏర్పాట్లు ఉండాలని, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.