News February 3, 2025

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు

image

నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు తప్పని సరిగా వేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట కలక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ డి వార్మింగ్ డే జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి సన్నాహక సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఫిబ్రవరి 10న అన్ని స్కూల్స్, సంక్షేమ హాస్టళ్లలలో మాత్రలు వేయించాలన్నారు.

Similar News

News April 19, 2026

దామరగిద్ద: కానుకుర్తి రిజర్వాయర్‌కు భూమి పూజ

image

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆదివారం దామరగిద్ద సమీపంలోని కానుకుర్తి రిజర్వాయర్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం కానుకుర్తి గ్రామ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం అభినందనీయమని, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

News April 19, 2026

అచ్చంపేట: వడదెబ్బతో ఒకరి మృతి

image

అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఎండల తీవ్రతకు ఒకరు బలయ్యారు. గ్రామానికి చెందిన బాలయ్య (35) వడదెబ్బకు గురై ఆదివారం ఉదయం మృతి చెందాడు. మద్యపానానికి అలవాటు ఉన్న బాలయ్య, తీవ్ర ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రాణాలు వదిలినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అధికారులు స్పందించి బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News April 19, 2026

NGKL: రైతుల ఖాతాలలో రేపు రెండో విడత రైతు భరోసా నిధులు

image

రైతుల ఖాతాలలో రేపు రెండో విడత రైతు భరోసా నిధులు జమ అవుతాయని నాగర్‌కర్నూల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంత్ రావు తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో జరిగే బహిరంగ సభ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేస్తారని తెలిపారు. జిల్లాలోని 63 రైతు వేదికల వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని లైవ్ ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.5 లక్షల మందికి రూ.103 కోట్ల వారి ఖాతాలో జమ కానున్నాయి.