News February 4, 2025
నులి పురుగుల నివారణ కోసం శిక్షణ

జాతీయ నులి పురుగుల నివారణ కోసం వరంగల్ డీఎంహెచ్వో కార్యాలయంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 10 నుంచి 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని 1,810 పాఠశాలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో 1,81,807 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు.
Similar News
News October 2, 2025
వరంగల్: శ్రీ రాజరాజేశ్వరీ అవతారంలో అమ్మవారి దర్శనం

వరంగల్ ఎంజీఎం సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరీ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం విజయ దశమి పురస్కరించుకుని సాయంత్రం అమ్మవారు వెండి చీరెలో దర్శనమిచ్చారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News October 2, 2025
గాంధీజీ చిత్రపటానికి వరంగల్ కలెక్టర్ నివాళి

వరంగల్ కలెక్టరేట్లో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
News October 2, 2025
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: వరంగల్ కలెక్టర్

విజయదశమి పర్వదినం సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందోత్సాహాలను నింపాలని ఆమె ఆకాంక్షించారు. దుర్గాదేవి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని, ఈ దసరా అందరికీ విజయాలను చేకూర్చాలని ఆమె ఆకాంక్షించారు.