News February 4, 2025

నులి పురుగుల నివారణ మాత్రలను మింగించండి : కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.  1663 అంగన్వాడీ కేంద్రాలు, 1957 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలను మింగించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News February 4, 2025

బాపట్ల: నందిగం సురేశ్‌కు ధైర్యం చెప్పిన జగన్

image

విదేశీ పర్యటన ముగించుకొని మాజీ సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి సోమవారం రాత్రి చేరుకున్నారు. దీంతో ఆయనను వైసీపీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ బాపట్ల మాజీ ఎంపీ నందింగం సురేశ్‌ను ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలను తెలుసుకున్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని ధైర్యం చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కార్యక్రమంలో అంబటి, పేర్నినాని, వెల్లంపల్లి తదితరులు పాల్గొన్నారు.

News February 4, 2025

 రెండు రోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి

image

కల్లూరు మండల పరిధిలోని లింగాల గ్రామ మాజీసర్పంచ్ మట్టూరి సీతారత్నం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. రెండు రోజుల క్రితం ఈమె భర్త మట్టూరి భద్రయ్య మృతి చెందాడు. రెండురోజుల వ్యవధిలో భార్య భర్తలు మృతి చెందడంతో లింగాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 4, 2025

ప.గో: నగ్న చిత్రాలు పేరుతో రూ.2.53 కోట్లు స్వాహా

image

అశ్లీల వీడియోల పేరుతో బెదిరించి నిడదవోలు శాంతి నగర్‌కు చెందిన యువతి నుంచి రూ.2.53 కోట్లు కాజేసిన నినావత్ దేవనాయక్‌‌ను గుంటూరులో అరెస్ట్ చేసినట్లు సీఐ తిలక్ సోమవారం తెలిపారు. యువతి HYD విప్రోలో ఉద్యోగం చేస్తోంది. యువతి నగ్న చిత్రాల తన వద్ద ఉన్నాయని వాటిని ఇంటర్నెట్‌లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు కావాలని డిమాండ్ చేశాడన్నారు. నిందితుడి వద్ద రూ.1.84 కోట్ల నగదు, స్థిరాస్తులను సీజ్ చేశామన్నారు.