News February 4, 2025
నులి పురుగుల నివారణ మాత్రలను మింగించండి : కలెక్టర్

జాతీయ నులిపురుగుల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ మాత్రలను మింగించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. 1663 అంగన్వాడీ కేంద్రాలు, 1957 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరిచేత ఆల్బెండజోల్ 400 గ్రాముల మాత్రలను మింగించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News February 8, 2025
కొడుకు ముందే ప్రాణాలు విడిచిన తల్లి

నార్పలకు చెందిన గంగమ్మ (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఆమె తన కొడుకు మంజునాథ్‌తో కలిసి నార్పల నుంచి హిందూపురానికి బైక్‌లో వెళ్తున్నారు. దారి మధ్యలో CK పల్లి మండలం NS గేటు సమీపంలో బైక్ గుంతలోకి దిగడంతో ఆమె ఎగిరి కింద పడ్డారు. గంగమ్మ తలకు తీవ్రగాయమై మృతి చెందింది. ఘటనకు ర్యాష్ డ్రైవింగే కారణమని స్థానికులు తెలిపారు. మృతిరాలి భర్త ఈశ్వరయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.
News February 8, 2025
రాజానగరం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రాజానగరం హైవే గైట్ ఇంజినీరింగ్ కాలేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. బొమ్మూరుకి చెందిన వాకలపూడి వెంకటేశ్వరరావు అతని భార్య రాజేశ్వరి(65)తో కలిసి రాజనగరం మండలం పల్లకడియంలో ఉంటున్న కుమార్తె ఇంటికి స్కూటీపై బయలుదేరారు. దీంతో వెనుక నుంచి వస్తున్న లారీ వారిని ఢీకొనడంతో తలకు బలమైన గాయమై రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు.
News February 8, 2025
కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.