News May 11, 2024
నువ్వే కారణం.. నీకు తెలుసా..?

‘నా ఒక్కడితో ఏమవుతుంది? ఓటు వేసినా వేయకపోయినా పరిస్థితులు ఏం మారడం లేదు’ అనుకుని నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలుసా..? నీలాంటి వారు ఓటేయనందుకే అసమర్థులు గెలిచి ఆశించిన పనులు జరగడం లేదు. ఇలా జరిగిన, జరుగుతున్న దానితో పాటు రేపు జరగబోయే దానికి కూడా నువ్వే కారణం. నువ్వు ఓటేస్తే అసలైన నాయకులు గెలిచే అవకాశముంది. అయిదేళ్ల భవిష్యత్తు కోసం అరగంట కేటాయించు. ఓటెయ్.
<<-se>>#VoteEyyaraBabu<<>>
Similar News
News November 23, 2025
ఉండి: ఆవాస్ సర్వే పరిశీలనలో కలెక్టర్

ఉండి రాజులపేటలో జరుగుతున్న ‘ఆవాస్’ సర్వేను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గృహ నిర్మాణాలకు అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం గృహ నిర్మాణ శాఖ చేపడుతున్న ఈ సర్వే తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు. యాప్ పనితీరు, ఆన్లైన్ ప్రక్రియపై వివరాలు అడిగారు. కముజు సూర్యకుమారి అనే లబ్ధిదారుని వివరాలను యాప్ ద్వారా ఆన్లైన్ చేస్తున్న విధానాన్ని ఆమె పరిశీలించారు.
News November 23, 2025
రేపు ఏలూరు జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ఆయన రోడ్డు మార్గంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వెళ్తారు. అక్కడ కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
News November 23, 2025
CM రేసులో నేనూ ఉన్నా: కర్ణాటక హోం మంత్రి

కర్ణాటకలో సీఎం మార్పు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడిని సీఎం చేయాలని డిమాండ్లు వస్తున్నందున తాను కూడా రేసులో ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఈ విషయంపై AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయితే ఇప్పటివరకు సీఎం మార్పుపై అధిష్ఠానం చర్చించలేదన్నారు.


