News February 22, 2025

నూకాంబికా జాతరపై CMకు కొణతాల లేఖ

image

అనకాపల్లి శ్రీనూకాంబికా అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి జాతర విశిష్ఠత గురించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌కు వివరించినట్లు తెలిపారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రజల తరఫున వీరిద్దరినీ ఆహ్వానించినట్లు చెప్పారు.

Similar News

News December 7, 2025

శ్రీకాకుళంలో 104 ఉద్యోగులు నిరసన

image

గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే 104 వాహనాల సిబ్బంది వేతన సమస్యలు, గ్రాట్యువిటీ, ఎర్న్‌డ్ లీవ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సిబ్బందిలో ఆందోళన నెలకొందని యూనియన్ నేతలు పేర్కొన్నారు.

News December 7, 2025

KNR: ఎమ్మెల్యేలూ.. నియోజకవర్గాలు విడిచి వెళ్లొద్దు..!

image

స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయేవరకు MLAలు నియోజకవర్గాలు వదిలి బయటకు రావద్దని PCC ఆదేశించినట్లు తెలుస్తోంది. గెలిచిన సర్పంచి స్థానాలను బట్టే MLAల పనితీరుకు గ్రేడింగ్ ఉంటుందని చెప్పినట్లు సమాచారం. దీంతో MLAలు నియోజకవర్గంలో తిష్ట వేసి ప్రతి గ్రామం విజయావకాశాలపై సమీక్షిస్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిపించి అధిష్ఠానం వద్ద మార్కులు కొట్టాలని ఉమ్మడి జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.

News December 7, 2025

కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తోట నవీన్ ఖరారు..?

image

కాకినాడ జిల్లా టీడీపీ నూతన అధ్యక్షుడిగా తోట నవీన్ పేరు ఖరారైనట్లు జిల్లాలో చర్చ సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జ్యోతుల నవీన్, తోట నవీన్ మధ్య ఈ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఎంపీ సానా సతీశ్ బాబు సిఫార్సుతో అధిష్ఠానం తోట నవీన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. సోమవారం దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.