News October 23, 2024
నూజివీడులో చిత్తూరు ఎంపీటీసీ డెడ్ బాడీ కలకలం

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం ఎంపీటీసీ కే.జగన్నాథం(40) మృతదేహం నూజివీడు ఆసుపత్రిలో కనిపించడం కలకలం రేపింది. చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు JCB కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో పోలీసులకు కనిపించింది.
Similar News
News February 25, 2026
చిత్తూరు: జాగ్రత్త.. 80 శాతం కల్తీనే.!

మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. వీటి పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News February 25, 2026
చిత్తూరు: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన!

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్‌గా వెంకటేశ్ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
News February 25, 2026
చిత్తూరు: పన్ను వసూళ్ల గడువు పెంపు

గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల డీపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో రూ.27.41 కోట్ల పన్ను వసూలు లక్ష్యంలో ఇప్పటివరకు రూ.18.63 కోట్లు(68 శాతం) వసూలైనట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


