News October 23, 2024

నూజివీడులో చిత్తూరు ఎంపీటీసీ డెడ్ బాడీ కలకలం

image

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం ఎంపీటీసీ కే.జగన్నాథం(40) మృతదేహం నూజివీడు ఆసుపత్రిలో కనిపించడం కలకలం రేపింది. చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు JCB కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో పోలీసులకు కనిపించింది.

Similar News

News November 8, 2024

20 లక్షల ఉద్యోగాలు: తిరుపతిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

image

యువత మెరుగైన భవిష్యత్తు కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించిన యువతరంగ్ -24 యూత్ ఫెస్టివల్‌లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి వేదికగా వరల్డ్ క్లాసు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు త్వరలోనే భూమి పూజ చేస్తామని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు.

News November 8, 2024

చిత్తూరు: అమ్మమ్మపై అత్యాచారం.. 34 ఏళ్లు జైలు శిక్ష

image

తంబళ్లపల్లి సద్దిగుట్టవారిపల్లెలో 2018లో తన అమ్మమ్మపై అత్యాచారం చేసి, అతి కిరాతకంగా చంపిన ఇంద్రప్రసాద్(38) అనే ముద్దాయికి 34 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 6 వ అదనపు జడ్జ్ శాంతి గురువారం తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తోట పురుషోత్తం వృద్ధురాలు తరపున కేసును వాదించారు. అత్యాచారం చేసినందుకు 20 ఏళ్లు, చంపినందుకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించారు.

News November 8, 2024

పలమనేరు: నూతన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి

image

నూతన బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు పలమనేరు నుంచి బెంగుళూరుకు వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి చొరవతో ఉన్నతాధికారులు ప్రత్యేక బస్సులను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు.