News April 7, 2025
నూజివీడులో నేడు పరిష్కార వేదిక కార్యక్రమం

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సోమవారం నూజివీడు నిర్వహించనున్నారు. ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ప్రజలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 19, 2025
ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.
News November 19, 2025
దివిసీమ జల ప్రళయానికి 48 ఏళ్లు

AP: దివిసీమ జల ప్రళయానికి నేటితో 48 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 నవంబర్ 19న కడలి ఉప్పొంగడంతో ఊళ్లు శవాల దిబ్బలుగా మారాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి తదితర ఎన్నో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎంతో మంది జల సమాధి అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 14 వేల మందికిపైగా చనిపోయారు. ఘటన జరిగిన 3 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి ఈ విషయం తెలియకపోవడం అత్యంత బాధాకరం.
News November 19, 2025
వినాయకుడిని ఏ సమయంలో పూజించడం ఉత్తమం?

బుధవారం వినాయకుడి పూజలకు శ్రేష్ఠం. ఉదయంతో పోల్చితే సాయంత్ర పూజల వల్ల విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. స్కంద పురాణం ప్రకారం.. సంధ్యా సమయంలో స్వామివారిని పూజిస్తే మనలోని ప్రతికూల శక్తులన్నీ హరించుకుపోతాయి. కొబ్బరి నూనె దీపం వెలిగించి, 21 గరికెలు సమర్పించి, గణేశుడి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తే.. బుద్ధి చతురత, వాక్శుద్ధి కలుగుతాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


