News March 31, 2024

నూజివీడు అసెంబ్లీకి 72 ఏళ్లలో ఐదుగురే అభ్యర్థులు

image

నూజివీడు నియోజకవర్గం నుంచి 72 ఏళ్లలో 15 సార్లు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటివరకు ఐదుగురు అభ్యర్థులు, 3 సామాజిక వర్గాలు మాత్రమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించాయి. 1952 నుంచి 1972వరకు డాక్టర్ ఎంఆర్ అప్పారావు, 1978, 1989లో పాలడుగు వెంకటరావు, 1983, 1985, 1994, 1999లో కోటగిరి హనుమంతరావు, 2004, 2014, 2019లో మేక వెంకట ప్రతాప్ అప్పారావు, 2009లో చిన్నం రామకోటయ్య గెలుపొంది ప్రాతినిధ్యం వహించారు.

Similar News

News January 1, 2025

విజయవాడ: ఒత్తిడితో విద్యార్థిని ఆత్మహత్య

image

బీఫార్మసీ చదువుతున్న బాలిక మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సింగినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని సీఐ వెంకటేశ్వర్ల నాయక్ తెలిపారు. పోలీసుల కథనం.. సింగినగర్‌కి చెందిన విద్యార్థిని చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News January 1, 2025

ప్రజలు సంతోషంగా జీవించాలి: కృష్ణా ఎస్పీ 

image

కృష్ణా జిల్లా ప్రజలందరికీ ఎస్పీ ఆర్.గంగాధర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. అందరికీ ఆనందాన్ని పంచే కొత్త సంవత్సర ఆగమన వేళ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలన్నారు.

News January 1, 2025

2024లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

image

కృష్ణా జిల్లాలో 2024 లో 9,719 కేసులు నమోదయ్యాయని SP ఆర్.గంగాధర్ అన్నారు. మంగళవారం ఆయన మచిలీపట్నంలో 2024 సంవత్సర నేరగణాంకాల నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023లో 9,813 కేసులు నమోదవ్వగా 2024లో ఆ సంఖ్య తగ్గిందన్నారు. పోలీసు శాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, కమ్యూనిటి పోలీసింగ్ కారణంగా నేరాల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.