News June 7, 2024
నూజివీడు: చూసి నవ్వినందుకు.. కత్తిపోట్లు

నూజివీడులో నిన్న <<13390738>>కత్తిపోట్ల ఘటన<<>> కలకలం రేపింది. SP మేరీ ప్రశాంతి వివరాలు.. నూజివీడుకు చెందిన YCP కౌన్సిలర్ గిరీశ్ కుమార్ మైలవరం రోడ్డులో మాంసందుకాణం నిర్వహిస్తుంటారు. పట్టణానికి చెందిన సాయి, సుధీర్ అటుగా వెళ్తూ అతనిని చూసి నవ్వారు. దీంతో గిరీశ్ వారిపై కత్తితో దాడిచేశాడు. విషయం తెలిసిన సాయికిరణ్ సోదరుడు అరుణ్ వచ్చి గిరీష్ను కత్తితో పొడిచాడు. ఈమేరకు వీరిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు SPతెలిపారు.
Similar News
News December 5, 2025
కృష్ణా: గోనె సంచుల కొరతపై సీఎస్ అరా

ధాన్యం సేకరణకు సంబంధించి జిల్లాలో నెలకొన్న గోనె సంచుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అరా తీశారు. ధాన్యం సేకరణపై గురువారం ఆయన రాష్ట్ర సచివాలయాల నుంచి కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. జిల్లాలో కోటి గోనె సంచుల అవసరాన్ని గుర్తించగా ఇప్పటికే 50 లక్షలు రైతులకు పంపిణీ చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి గోనె సంచుల సరఫరాకు సహకరించాలని సీఎస్ను కోరారు.

News December 4, 2025
గుడివాడ-కంకిపాడు రోడ్డు నిర్మాణం ప్రారంభించండి: బాలశౌరి

ఢిల్లీలోని పార్లమెంట్ హాల్లో CoSL ఛైర్మన్ ఎంపీ బాలశౌరితో నేషనల్ హైవే ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గుడివాడ-కంకిపాడు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, పెడన లక్ష్మీపురం రోడ్డు, తదితర పనులను ఎంపీ బాలశౌరి NHAI ఛైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఛైర్మన్ సానుకూలంగా స్పందించి, ఆ పనులను త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.