News April 24, 2025
నూజివీడు: ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది . దీనిలో భాగంగా నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం త్రిబుల్ ఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గానూ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గురువారం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈనెల 27 నుంచి మే 20వ తేదీలోపు ఆర్జీయూకేటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 25, 2025
BREAKING: RCB సూపర్ విక్టరీ

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ ఎట్టకేలకు హోంగ్రౌండు(చిన్నస్వామి)లో గెలుపు బోణీ కొట్టింది. 206 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్‌ను 194/9 స్కోరుకు కట్టడి చేసి 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. జైస్వాల్ 49, సూర్యవంశీ 16, నితీశ్ 28, పరాగ్ 22, జురెల్ 47, హెట్మైర్ 11, శుభమ్ 12 పరుగులు చేశారు. RCB బౌలర్లలో హాజిల్‌వుడ్ 4, కృనాల్ 2, భువనేశ్వర్, యశ్ దయాల్ చెరో వికెట్ తీశారు.
News April 25, 2025
సింధు జలాల ఒప్పందం రద్దు.. పాక్‌కు తేల్చిచెప్పిన భారత్

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు భారత్ ప్రకటించింది. తక్షణమే జల ఒప్పందం రద్దు అమల్లోకి వస్తుందని తెలియజేస్తూ జలవనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ పాక్‌కు లేఖ రాశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహించడమే కారణమని పేర్కొన్నారు. అగ్రిమెంట్‌లో భాగంగా సంప్రదింపులకు విజ్ఞప్తిని పలుమార్లు పాక్ తిరస్కరించిందని గుర్తు చేశారు.
News April 25, 2025
వరంగల్ జిల్లాలో ఈరోజు HEAD LINES

✓వరంగల్ కమిషనరేట్లో విస్తృతంగా తనిఖీలు
✓WGL: క్వింటా పత్తి ధర రూ.7,700
✓సంగెం మండలంలో పర్యటించిన పరకాల MLA రేవూరి
✓భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న MLC కవిత
✓నల్లబెల్లి: గొర్రెలు, మేకలు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్
✓11వ రోజుకు చేరిన తూర్పు జర్నలిస్టుల దీక్ష
✓WRPT: ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన MLA నాగరాజు
✓ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతి చేకూరాలని పలుచోట్ల ర్యాలీలు