News February 22, 2025
నూజివీడు: తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య

నూజివీడు పట్టణ పరిధిలోని బాపునగర్ రోడ్డులో గల పాలిటెక్నిక్ విద్యార్థిని బట్ర వెంకట రమ్య (18) శనివారం ఇంటిలోని దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకొని రమ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలేజీకి వెళ్లలేదని తల్లి మందలించడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 23, 2025
టాసుల్లో టీమ్ ఇండియా ఓటముల పరంపర

టీమ్ ఇండియా టాసుల ఓటముల పరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులోనూ టాస్ ఓడింది. రోహిత్ ‘హెడ్స్’ అనగానే కాయిన్ రివర్స్‌లో పడింది. దీంతో వన్డేల్లో వరుసగా 12వ మ్యాచులోనూ భారత్ టాస్ పరాభవం ఎదుర్కొంది. ఈ క్రమంలో నెదర్లాండ్స్(11 టాస్ ఓటములు)ను భారత్ అధిగమించింది. ఇండియన్ టీమ్ 2023 వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటివరకు 12 సార్లు టాస్ గెలవలేకపోయింది.
News February 23, 2025
అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్‌లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
News February 23, 2025
బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.