News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 1, 2025
తొక్కిసలాట ఘటనపై అధికారుల వివరణ

AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై అధికారులు వివరణ ఇచ్చారు. ఇవాళ ఆలయానికి 15వేల మంది వచ్చారని వెల్లడించారు. ఘటనాస్థలిలో ఏడుగురు, పలాస ఆస్పత్రిలో ఇద్దరు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనలో 13 మందికి గాయాలయ్యాయని, వారికి పలాస ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
News November 1, 2025
ప్రొద్దుటూరులో బయటపడిన శ్రీ కృష్ణదేవరాయ శిలా శాసనం

ప్రొద్దుటూరులోని సినీ హబ్ శనివారం ఇంటి నిర్మాణం కోసం జేసీబీతో తవ్వుతుండగా శ్రీకృష్ణదేవరాయ శిలాశాసనం బయట పడినట్లు భారత పురావస్తు పరిశోధన డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు. ఇది క్రీస్తు శకం 1523 కాలం నాటిదన్నారు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దేవి పుణ్యం కోసం కావులూరులో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు వెల్లడించారు. క్రీస్తు శకం 1523 జనవరి 24 శనివారం ఈ శిలా శాసనం వేయించారన్నారు.
News November 1, 2025
ప్రకృతి సేద్యంలో వరి సాగు – ఆకునల్లి, పచ్చదోమ నివారణ

☛ ఆకునల్లి నివారణకు గట్ల మీద బంతి మొక్కలు నాటాలి. పంట మీద ఆవుపేడ, ఆవు మూత్రం, ఇంగువతో చేసిన 5 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.
☛ పచ్చదోమ నివారణకు పసుపు, తెల్లని జిగురు అట్టలను ఎకరానికి 20-25 చొప్పున అమర్చుకోవాలి. ఎకరానికి ఒక లైట్ ట్రాప్ (దీపపు ఎర)ను పెట్టాలి. 100 లీటర్ల నీటికి 5లీటర్ల వావిలాకు కషాయాన్ని కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి.


