News April 3, 2025
నూజివీడు యువకుడు చికిత్స పొందుతూ మృతి

నూజివీడు పట్టణం రామమ్మారావుపేటకు చెందిన పండు బాబు (25) చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 21న కడుపులో నొప్పి తట్టుకోలేక పురుగు మందు తాగి నూజివీడు ఏరియా ఆసుపత్రిలో చేరాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ పండు బాబు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 23, 2025
కనగానపల్లి వద్ద ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

కనగానపల్లి మండలంలోని మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పుట్టపర్తి అగ్నిమాపక శాఖలో పని చేస్తున్న ఫైర్ కానిస్టేబుల్ సుధాకర్(32) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 23, 2025
మహిళల ఆర్థిక స్వాలంబనే లక్ష్యం: సీతక్క

మహిళల ఆర్థిక స్వాలంబన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ సీతక్క ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తోందన్నారు. మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
News April 23, 2025
ఎంపీ కార్యాలయం పేరు మారిస్తే బాగుండు: కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ భవన్ పేరు మార్చి చార్లెస్ శోభరాజ్ భవన్ పేరు పెడితే బాగుంటుందని మాజీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్లో పేర్కొన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఎంపీ కేశినేని చిన్ని చేసే పనులు ఇసుక వ్యాపారం, ప్లై యాష్ తోలకం, భూ దందాలు, బ్రోకరేజ్‌లు, పేకాట, రేషన్ బియ్యం మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎంపీ కార్యాలయంలో చేస్తున్నారని మండిపడ్డారు.