News January 25, 2025
నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష

ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఈ సర్వే రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉన్నందున www.telangana.gov.in /telanganarising అనే వెబ్‌సైట్‌ను సందర్శించి ప్రతీ ఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని తెలిపారు.
News October 22, 2025
నిజామాబాద్: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలంపాడ్ గ్రామంలోని క్యాంప్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు వ్యవసాయ అధికారుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా అందించాలని, తూకం, మిల్లులకు తరలింపు సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.
News October 22, 2025
సూర్యాపేట: జాబ్ మేళా ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్, ఎస్పీ నర్సింహాతో కలిసి మంగళవారం పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.