News January 25, 2025

నూజివీడు: లారీ డ్రైవర్‌కు జైలు శిక్ష

image

ఓ లారీ డ్రైవర్‌కు మూడు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. 2020లో బాపులపాడుకు చెందిన లెనిన్ ఆయన కుమార్తె శ్రీదేవీ బైకుపై వెళుతుండగా వారిని లారీ ఢీ కొట్టింది. దీంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీనిపై అప్పట్లో హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో లారీ డ్రైవర్ ప్రభాకర్‌కు శిక్ష పడింది.

Similar News

News February 13, 2025

అలంపూర్ : సమస్యల పుట్టగా ప్రభుత్వ కళాశాల

image

అలంపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల పుట్టగా మారింది. ఈ క్రమంలో కళాశాల క్రీడా ప్రాంగణంలో మొత్తం నీరు చేరి విద్యార్థులకు ఆడుకోవడానికి ఇబ్బందిగా మారింది. అదేవిధంగా ఆవరణలో మొత్తం పిచ్చి మొక్కలు మొలిచి విష సర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

News February 13, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పరిశీలకుల నియామకం

image

పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులను నియమించిందని రిటర్నింగ్ ఆఫీసర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ కుమార్ నంబర్ 9398416403, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా నంబర్ 7993744287లో సంప్రదించాలని తెలిపారు.

News February 13, 2025

భార్య వేధింపులు.. ప్రముఖ సింగర్ ఆత్మహత్య!

image

భార్యల వేధింపులతో భర్తలు <<15216504>>బలవన్మరణానికి<<>> పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశాకు చెందిన ప్రముఖ సింగర్, ర్యాపర్ అభివన్ సింగ్ బెంగళూరులో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, ఆమె కుటుంబీకులు చేసిన మెంటల్ టార్చర్ వల్లే తన కుమారుడు చనిపోయాడంటూ తండ్రి బిజయ్ మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!