News February 15, 2025
నూజివీడు: విద్యార్థి ఆత్మహత్యాయత్నం

నూజివీడు మండలానికి చెందిన 10వ తరగతి విద్యార్థి ప్రీ ఫైనల్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి విజయవాడలో చదువుతున్నాడు. మార్కులు తక్కువ రావడంతో చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 28, 2025
సిద్దిపేటలో యాదాద్రి వాసికి జాక్పాట్

తెలంగాణలో మద్యం టెండర్ల లక్కీ డ్రాలో భువనగిరి జిల్లా చల్లూరుకి చెందిన భీమగాని బాలనరసయ్య అదృష్టం వరించింది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఏకంగా ఆరు మద్యం దుకాణాలను ఆయన దక్కించుకున్నారు. రాయపోల్, అంబర్పేట్, చిన్నకోడూరు, పుదూర్, మజీద్పూర్లోని వైన్స్ షాపులు కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట లక్కీ డ్రా ద్వారా వచ్చాయని నరసయ్య తెలిపారు.
News October 28, 2025
రూ.765 కోట్లతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ

AP: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద రాష్ట్రంలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. దీంతో దాదాపు 955 మందికి ఉపాధి లభించనుంది. 3 రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడులతో 7 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీ, 5,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
News October 28, 2025
వనపర్తి: మద్యం దుకాణాల లక్కీడిప్.. కొత్తవారిని వరించిన అదృష్టం

జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు కోసం కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆధ్వర్యంలో లక్కీడిప్ నిర్వహించారు. DEC నుంచి ప్రారంభమయ్యే కొత్త పాలసీలో మొత్తం 36 దుకాణాలను కేటాయించగా, అగ్రభాగం కొత్తవారినే వరించింది. జిల్లా కేంద్రంలోని 6 దుకాణాలకుగాను 4 కొత్త వారికి దక్కాయి. 40కి పైగా దరఖాస్తులు వేసిన పాత సిండికేట్లకు నిరాశ ఎదురైంది. కొత్తకోట, పానగల్, పెబ్బేరులోనూ కొత్తవారికే దుకాణాలు లభించాయి.


