News February 2, 2025
నూతన చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం: ఎస్పీ గిరిధర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేరన్యాయ చట్టాలు-2023 ద్వారా దర్యాప్తును వేగవంతంగా చేయడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని వనపర్తి ఎస్పీ గిరిధర్ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ పోలీసు లీగల్ అడ్వైజర్, రిటైర్డ్ పీపీ రాములుతో నూతన చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడానికి నూతన చట్టాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
Similar News
News November 26, 2025
అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దాం: SP

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చూపిన మార్గంలో నడుద్దామని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం సిరిసిల్లలోని పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకుంటామని ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
News November 26, 2025
ఏలూరు: ఒడిశా టూ హైదరాబాద్ అక్రమ రవాణా

పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి పోలీసులు బుధవారం నిర్వహించిన విస్తృత వాహన తనిఖీల్లో గోవుల అక్రమ రవాణా వెలుగుచూసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా లారీలో తరలిస్తున్న గోవులను గుర్తించి పట్టుకున్నారు. గోవులను సురక్షిత ప్రాంతానికి తరలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 26, 2025
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.


