News August 3, 2024

నూతన చట్టాలపై అవగాహన ఉండాలి: సంగారెడ్డి ఎస్పీ

image

పోలీసులు నూతన చట్టాలపై అవగాహన ఉండాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ముందస్తు విచారణ చేయాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు.

Similar News

News September 20, 2024

MDK: రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: రోహిత్

image

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించారు. రాహుల్ గాంధీపై అనుచిత వాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై మీ కామెంట్?

News September 20, 2024

మెదక్ జిల్లాలో సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి: ఎస్పీ

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషి వల్ల గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగిసాయన్నారు.

News September 19, 2024

సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.