News February 2, 2025
నూతన డీజీపీని కలిసిన ప.గో ఎస్పీ

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయనను ప.గో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీకి పూల మొక్క అందజేశారు. అనంతరం జిల్లాలోని లా అండ్ ఆర్డర్ గురించి డీజీపీకి వివరించారు.
Similar News
News February 20, 2025
భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా నిర్వహించి నివేధికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుండి భూముల రీసర్వేపై సీసీఎల్ఏ జి జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో భూముల రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నివేదికలు పంపాలని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
News February 19, 2025
27న ప.గో జిల్లాలో సెలవు

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. పలువురు అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఈక్రమంలో 27వ తేదీన స్పెషల్ లీవ్ మంజూరైందని ఎన్నికల అధికారి, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా సెలవును అడ్జస్ట్ చేసుకోవాలని ఆమె సూచించారు.
News February 19, 2025
ఏలూరు: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్

నవ వధువు పారిపోయిన ఘటన ఏలూరులో వెలుగు చూసింది. బాధితుడి వివరాల మేరకు.. ఏలూరు గజ్జలవారి చెరువుకు చెందిన శివనాగ సాయికృష్ణ, విశాఖ కంచరపాలేనికి చెందిన బోడేపు చంద్రహాసినితో జనవరి 31న పెళ్లి జరిగింది. వారం క్రితం బిట్టుబారు సమీపంలో కాపురం ప్రారంభించారు. ఈనెల 16న రాత్రి భర్త నిద్రపోయాక భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. 4 కాసుల గోల్డ్ చైన్, ఉంగరం, వెండి పట్టీలతో ఆమె పారిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.