News February 1, 2025
నూతన డీజీపీని కలిసిన బాపట్ల ఎస్పీ

నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తాను బాపట్ల ఎస్పీ తుషార్ డూడి మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను డీజీపీకి వివరించారు.
Similar News
News February 19, 2025
ప్రకాశం జిల్లాలో విషాదం

ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీపంలోని చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. మృతులు సంతనూతలపాడుకు చెందిన బాపట్ల సుజాత(35), అశ్వజ్ఞ(6 నెలలు)గా గుర్తించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2025
వరంగల్: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌కు చెందిన రాజేశ్(24) కొంతకాలంగా HYDలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడి స్నేహితుడి పెళ్లి కోసం ఇంటికి వచ్చాడు.ఆదివారం ఉదయం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని కన్పించాడు. మెడపై గాయాలున్నాయనే ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
46 మంది టీడీపీ నేతలపై కేసు కొట్టివేత: ఎస్ఐ సతీశ్

మాచవరం మండలం తురకపాలెం తెలుగుదేశం పార్టీ వర్గీయులపై నమోదైన హత్య కేసును గురజాల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి శ్రీనివాసరావు కొట్టివేశారని మాచవరం ఎస్ఐ సతీశ్ తెలిపారు. 2019 జూలై 1న తురకపాలెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఘర్షణ జరిగింది. టీడీపీ వర్గీయులైన షేక్ అల్లావుద్దీన్‌తో పాటు 46 మందిపై అప్పట్లో కేసు నమోదు అయింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.