News June 20, 2024

నూతన డీజీపీ తిరుమలరావు మన గుంటూరు వాసి

image

రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు‌ నియమించిన విషయం తెలిసిందే. అయితే తిరుమలరావు గుంటూరు వాసి కృష్ణ నగర్‌లోని మున్సిపల్‌ స్కూల్లో 5వ తరగతి వరకు, ఆ తర్వాత లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్‌లో 10వ తరగతి వరకు చదివారు. ఆయన కొంతకాలం గుంటూరు టీజేపీస్‌ కళాశాలలో మేథమేటిక్స్‌ లెక్చరర్‌గా పని చేశారు. అనంతరం 1989లో ఆయన ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఆయన భార్య వైద్య విభాగంలో ప్రొఫెసర్‌.

Similar News

News December 9, 2025

మంగళగిరి: సీకే హైస్కూల్ ఈసారైనా రాణిస్తుందా?

image

మంగళగిరిలో ఏళ్ల చరిత్ర కలిగిన CKహైస్కూల్ విద్యార్థులు ఈసారైనా టెన్త్ ఫలితాల్లో రాణిస్తారా అనేది వేచి చూడాలి. గతంలో ఈ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి మార్కులతో సత్తా చాటేవారు. కొన్నేళ్లుగా ర్యాంకుల సంగతి అటుంచితే ఉత్తీర్ణత శాతమే భారీగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం విద్యాశాఖ అమలు చేస్తున్న 100రోజుల ప్రణాళికను టీచర్లు పటిష్ఠంగా అమలు చేసి మంచి ఫలితాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.

News December 9, 2025

GNT: అధికార పార్టీ ఎమ్మెల్యే.. అసంతృప్తి స్వరం..!

image

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవీ నిత్యం అధికారులపై ఏదో ఒక రూపంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రోటోకాల్ దక్కలేదని ఒకసారి, రేషన్ డీలర్లపై మరోసారి కలెక్టర్‌కి గతంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమె కార్యాలయం ముందు గుంతలు పడిన రహదారిని పూడ్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గం ఇటు ప్రజల్లో, అటు SMలో హాట్ టాపిక్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News December 9, 2025

గుంటూరు జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు : DEO

image

గుంటూరు జిల్లాలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(APTET) ఈ నెల10 నుంచి 21 వరకు 5 కేంద్రాల్లో జరుగుతుందని DEOసీవీ రేణుక తెలిపారు. పేరేచర్ల యూనివర్సల్ కాలేజ్ (7996), 5వ మైలు ప్రియదర్శిని (9651), నల్లపాడు క్లే క్యాంపస్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్(30318), పుల్లడిగుంట మలినేని పెరుమాళ్ళు కాలేజ్(8891), పుల్లడిగుంట మలినేని లక్ష్మయ్య మహిళాకాలేజ్ (1260)లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం, సాయంత్రం పరీక్ష ఉంటుందన్నారు.