News October 1, 2024

నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా

image

వరంగల్ జిల్లా క్రిస్టియన్ కాలనీలోని సీబీసీ చర్చి నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. అనంతరం మంత్రి దంపతులను పలువురు సభ్యులు ఘనంగా సన్మానించారు.

Similar News

News January 6, 2026

వరంగల్: ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులకు ఆహ్వానం

image

వరంగల్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిణి పి.భాగ్యలక్ష్మీ తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన విద్యార్థులు అవసరమైన పత్రాలతో గడువులోపు దరఖాస్తు చేయాలని ఆమె కోరారు.

News January 5, 2026

సూసైడ్‌కు యత్నం.. కాపాడిన వరంగల్ పోలీసులు

image

వరంగల్ రైల్వే అండర్ బ్రిడ్జి రైలు పట్టాలపై దేశాయిపేట ప్రాంతానికి చెందిన మంద వినోద్ అన్న యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడగా మిల్స్ కాలనీ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, రాధిక అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకుంటున్నా యువకుడు పట్టాలపై పడుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా బయటకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News January 5, 2026

వరంగల్‌ ప్రజావాణిలో 151 దరఖాస్తుల స్వీకరణ

image

వరంగల్‌ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 151 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 59 దరఖాస్తులు కాగా, జీడబ్ల్యూఎంసీ (GWMC)కు 20, డీఆర్‌డీఓ, డీపీఓ శాఖలకు చెరో 11 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. మిగతా వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు 50 ఉన్నట్లు వెల్లడించారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తును త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.