News March 5, 2025

నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం: మంత్రి దామోదర్

image

వచ్చే విద్యా సంవత్సరంలో తరగతులు ప్రారంభం అయ్యేలా నూతన మెడికల్ కాలేజీలు సిద్ధం కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశిం‌చారు. హైదరాబాద్‌లోని నూతన మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలలో మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్నారు.

Similar News

News March 23, 2025

మెదక్: విషాదం.. అప్పుల బాధతో రైతు మృతి

image

అప్పుల బాధతో రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కౌడిపల్లి మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు..  కుషన్ గడ్డ తండాకు చెందిన పాల్త్యజీవుల (50) నెల రోజుల్లోనే తనకున్న మూడు ఎకరాల పొలంలో మూడు బోర్లు వేయించిన, నీళ్లు రాలేదు. బోర్ల కోసం రూ.3 లక్షలు అప్పు చేశాడు. దీంతో శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 23, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

image

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్ (17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.

News March 23, 2025

మెదక్: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

image

ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నర్సాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. సునీత లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సిరివెన్నెల అనే వివాహిత ఈనెల 20న హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!