News November 30, 2024

నూతన వితంతు పింఛన్ల‌పై కర్నూలు కలెక్టర్ కీలక ప్రకటన

image

NTR భరోసా పింఛను పథకం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నూతన మార్గదర్శకాలు జారీ చేసిందని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మార్గదర్శకాల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యాజమాని మరణిస్తే వెంటనే అతని భార్యకు వితంతు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఈ ఉత్తర్వులు 01.11.2024 తేదీ తర్వాత మరణించిన వారికి మాత్రమే వర్తిస్తాయని, అర్హులైన వారు వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News February 10, 2026

కర్నూలు రేంజ్‌లో 9 మంది సీఐల బదిలీ

image

కర్నూలు రేంజ్ పరిధిలో 9 మంది సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్ రెడ్డి అన్నమయ్య- SM నంద్యాలకు, అహ్మద్ రియాజ్ ప్రొద్దుటూరు-నంద్యాలకు, గోవింద్ రెడ్డి, దస్తగిరి కడప-నంద్యాలకు, ప్రసాద్ బాబు మన్నూరు-అన్నమయ్యకు, లింగప్ప బద్వేల్-మాన్నూరు, రామకృష్ణ SSS(D)- బద్వేల్‌కు, మహ్మద్ రఫీ మదనపల్లి 1-2టౌన్‌కు, రాజారెడ్డిని మదనపల్లి 2- 1టౌన్‌కు బదిలీ చేశారు.

News February 10, 2026

అభివృద్ధి పనుల్లో స్పష్టమైన పురోగతి చూపాలి: కర్నూలు కలెక్టర్

image

జిల్లాలో అన్ని శాఖలు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో ఖచ్చితమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ డా. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం సీఎం వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మార్చిలో జరిగే కలెక్టర్ల సమావేశం నాటికి అన్ని విభాగాల్లో ఫలితాలు చూపాలని సూచించారు. జాబ్ మేళాల ద్వారా 7 నుంచి 8 వేల మందికి ఉపాధి కల్పించాలని, PGRS ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలని ఆదేశించారు.