News February 3, 2025
నూతన విద్యా పాలసీ రూపకల్పనపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా: కలెక్టర్

ఫిబ్రవరి 4 న నిర్వహించాల్సిన విద్యా కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేస్తున్నట్టు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. రాష్ట్ర నూతన విద్యా పాలసీ రూపకల్పనపై నిర్వహించవలసిన ప్రజాభిప్రాయ సేకరణను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సూచించారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి ప్రకటన జారీ చేశారు.
Similar News
News February 7, 2025
కశింకోటలో కిలో బెండ రూ.100

బెండకాయల ధర గణనీయంగా పెరిగింది. గురువారం కశింకోట వారపు సంతలో కిలో రూ.100 చొప్పున విక్రయాలు జరిగాయి. కాగా వంకాయలు, టమాటా ధరలు మాత్రం తగ్గాయి. గతవారం కిలో రూ.20 ఉన్న టమాటా ఈ వారం రూ.15కు తగ్గింది. గతవారం 80 రూపాయలకు అమ్మిన వంకాయల ధర రూ.30కి పడిపోయింది. ఉల్లి, బంగాళదుంప ధరలు కిలో రూ.40, బీట్ రూట్, బీన్స్ రూ.50కి విక్రయించారు.
News February 7, 2025
SKLM: రహదారి నిర్మాణానికి రూ.45.50 కోట్లు మంజూరు

వెంకటాపురం నుంచి సంతబొమ్మాలి మండలం నౌపడ రహదారి నిర్మాణానికి రూ.45 కోట్ల 50 లక్షలు మంజూరైనట్లు సామాజిక కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ ఈశ్వరరావు గురువారం తెలిపారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గతంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన రహదారి నిర్మాణానికి కృషి చేసినట్లు పేర్కొన్నారు.
News February 7, 2025
మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ: శోభిత

‘తండేల్’ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది dec 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.