News January 1, 2025

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం..

image

గాజువాకలో విషాదం నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటుండగా క్రాకర్స్ బ్లాస్ట్ కావడంతో ఒకరు మృతి చెందారు. వడ్లపూడి రజకవీధిలో అర్ధరాత్రి 12.05 సమయంలో సుద్దమళ్ల శివ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసే సమయంలో క్రాకర్స్ బ్లాస్ట్ కావడంతో అతని నుదిటికి గాయమైంది. చికిత్స కొసం కోసం తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News July 5, 2025

విశాఖలో టాస్క్‌ఫోర్స్‌కు అదనపు సిబ్బంది

image

విశాఖలో టాస్క్ ఫోర్స్ బలోపేతం చేసేలా పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సీఐల పర్యవేక్షణలో టాస్క్ ముమ్మరంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇస్తూ మరో ఏడుగురి సిబ్బందిని నియమించారు. భీమిలి ఎస్ఐ హరీశ్‌తో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, మరో ఐదుగురు కానిస్టేబుళ్లను టాస్క్‌ఫోర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 5, 2025

విశాఖ: A.P.E.P.D.C.L. పరిధిలో C.G.R.F సదస్సులు

image

ఈనెల 8 నుండి A.P.E.P.D.C.L. పరిధిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F) సదస్సులు నిర్వహిస్తామని ఛైర్మన్ బి.సత్యనారాయణ తెలిపారు. సంస్థ సెక్షన్ కార్యాలయాల్లో సదస్సులు జరుగుతాయన్నారు. విద్యుత్ వినియోగదారులు నేరుగా సదస్సుల్లో పాల్గొని ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లులు తదితర సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు.

News July 5, 2025

సింహాచలం గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష

image

సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యారు. గిరిప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, టాయిలెట్ సదుపాయాలతోపాటు వైద్య శిబిరాల గురించి చర్చించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ విన్నవించారు.