News January 1, 2025
నూతన సంవత్సర శుభాకాంక్షలు: శ్రీకాకుళం ఎస్పీ

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు 2025 నూతన సంవత్సరంలో ఏర్పరుచుకున్న, నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ పోలీసుశాఖకు సహకరించి, వేడుకలను ప్రశాంతంగా ఇళ్ల వద్దనే జరుపుకోవాలన్నారు.
Similar News
News December 13, 2025
కంచిలి: రైలు ఢీకొని టెన్త్ విద్యార్థిని మృతి

కంచిలి మండలంలో గురువారం రాత్రి వందే భారత్ రైలు ఢీకొని పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది. పలాస జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కంచిలి పట్టణం బలియాపుట్టుగ కాలనీకి చెందిన సాలిన గంగోత్రిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి నిర్ధారించుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
News December 13, 2025
పొందూరు బ్రాండ్.. అద్భుత ట్రెండ్!

మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత ప్రముఖుల మనసుదోచుకున్న వస్త్రం పొందూరు ఖాదీ. ఎండతాపం నుంచి ఉపశమనం, చల్లదనాన్ని ఇవ్వడం ఈ వస్త్రం ప్రత్యేకత. ఇంతటి ఖ్యాతి గడించిన ఖద్ధరకు భౌగోళిక గుర్తింపు(జీఐ) ట్యాగ్ లభించింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిన్న అధికారిక పత్రాన్ని జారీ చేసింది. ఈ కీర్తి వచ్చేలా కేంద్రమంత్రి రామ్మోనాయుడు కృషి చేయడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 13, 2025
SKLM: ‘యూరియా నిల్వలను రైతులు వినియోగించుకోండి’

ప్రస్తుత రబీ పంటకు సంబంధించిన మొక్కజొన్న, వరి, ఇతర పంటలకు అవసరమైన యూరియాను జిల్లాకు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట విస్తీర్ణాన్ని బట్టి మండలాల్లోని రైతు సేవా కేంద్రాలు (ఆర్బీకేలు), పీఏసీఎస్, డీసీఎంఎస్ కేంద్రాలు, ప్రైవేటు డీలర్ల ద్వారా రైతులకు కొరత లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం 2379 యూరియా నిల్వ ఉందన్నారు.


