News August 7, 2024

నెక్కొండలో ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ రైలు హాల్టింగ్

image

వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు హాల్టింగ్‌కు రైల్వే అధికారులు ఆమోదించారు. గత కొన్నాళ్లుగా నెక్కొండలో పలు రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ కొనసాగుతోంది. ఇందులో ఇంటర్సిటీ రైలు హాల్టింగ్ డిమాండ్ ఉంది. రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రాను, పోను హాల్టింగ్ ఇచ్చారు.

Similar News

News September 18, 2024

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ

image

వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మెదక్ ఎంపీకి స్థానిక బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

News September 18, 2024

వరంగల్: క్వింటా పత్తి ధర రూ.7,810

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,860 పలకగా.. ఈరోజు రూ.7,810కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయని చెబుతున్నారు. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News September 18, 2024

పద్మాక్షి అమ్మవారి శరన్నవరాత్రులకు రావాలని సీఎంకు ఆహ్వానం

image

శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవికి వచ్చేనెల 3 నుంచి 14 వరకు శరన్నవరాత్రులు జరుగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-గీతా రెడ్డి దంపతులను పద్మాక్షి అమ్మవారి దేవాలయ వేద పండితులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని కలిసి ఆహ్వానించారు. సీఎంకు అమ్మవారి ప్రసాదం అందజేసి ఆశీర్వచనం చేశారు.