News January 30, 2025

నెక్కొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు!

image

కారు ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే రోడ్డులో అప్పలరావుపేట గ్రామ శివారు మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 17, 2025

ఎన్టీఆర్: 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

ఎన్టీఆర్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన ఆయా, అకౌంటెంట్, కుక్‌తో పాటు మొత్తంగా 20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ, వేతనం వివరాలకు https://ntr.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని..ఆసక్తి కల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 22లోపు విజయవాడ మారుతినగర్‌ 2వ లైనులోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందచేయాలని సంబంధిత అధికారులు సూచించారు.

News October 17, 2025

నల్గొండ: రౌడీ షీటర్ 6 నెలల నగర బహిష్కరణ

image

రౌడీ షీటర్‌, ‘మిస్టర్‌ టీ’ యజమాని కె.నవీన్‌ రెడ్డిని 6 నెలల పాటు నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లు రాచకొండ CP సుధీర్‌ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ(M) ముషంపల్లికి చెందిన నవీన్‌ రెడ్డి HYDకు వెళ్లి, ‘మిస్టర్‌ టీ’, ‘మిస్టర్‌ ఇరానీ టీ’ ఫ్రాంఛైజీలతో వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి కార్యకలాపాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయని, స్థానికులు భయాందోళన చెందుతున్నారని CP తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News October 17, 2025

క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

image

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్‌తో పనిచేయాలని సూచించారు.