News January 30, 2025

నెక్కొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు!

image

కారు ప్రమాదవశాత్తు పంట పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నెక్కొండ నుంచి కేసముద్రం వెళ్లే రోడ్డులో అప్పలరావుపేట గ్రామ శివారు మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి వెళ్లి పల్టీ కొట్టింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 17, 2025

డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్‌కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రాధాన్యత: కలెక్టర్ ప్రావీణ్య

image

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాఠకులకు ఎలాంటి పుస్తకాలు కావాలన్నా వెంటనే అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి వసుంధర పాల్గొన్నారు.