News March 2, 2025

నెక్కొండ: భార్య తిట్టిందని పురుగుమందు తాగాడు: SI

image

భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన నెక్కొండ మండలంలో చోటు చేసుకుంది. ఎస్సె మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటతండాకు చెందిన ధరావత్ శ్రీనివాస్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య తిట్టడంతో బాధపడిన శ్రీనివాస్ పురుగుమందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.

Similar News

News December 3, 2025

హిల్ట్ పాలసీ లీక్.. విచారణకు ప్రభుత్వం ఆదేశం!

image

TG: హిల్ట్ పాలసీ కసరత్తు దశలోనే వివరాలు బయటకు రావడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 20నే ఫొటోషాప్‌ స్లైడ్స్‌ బయటకు వచ్చాయని అనుమానిస్తోంది. మరుసటి రోజే <<18440700>>హిల్ట్‌ <<>>పాలసీపై KTR ప్రెస్‌మీట్‌ పెట్టడంతో కొందరు సీనియర్ IAS అధికారులకు CM వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ‌NOV 22న జీవో విడుదలవ్వగా లీక్ విషయమై ఐపీఎస్ నేతృత్వంలో నిఘా వర్గాలు సమాచారం సేకరించే పనిలో పడ్డాయి.

News December 3, 2025

అన్నమయ్య జిల్లా రైతులకు గమనిక

image

అన్నమయ్య జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైనట్లు JC ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. రైతుల సౌకర్యార్థం రాయచోటి, నిమ్మనపల్లె, రామాపురం,వీరబల్లి, గాలివీడు తదితర ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం సాధారణ వరి క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ వరి క్వింటాకు రూ.2,389 చెల్లిస్తామన్నారు.

News December 3, 2025

ప్రమోషన్లు, సీనియారిటీ సమస్యల పరిష్కారానికి CMD హామీ

image

వరంగల్‌లో TGNPDCL ట్రేడ్ యూనియన్ల JAC ప్రతినిధులు CMD కర్నాటి వరుణ్ రెడ్డి ని కలిసి O&M, Provincial కేడర్‌లలో నిలిచిన ప్రమోషన్‌లను వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అనంతరం ప్రమోషన్లు ఇస్తామని, అలాగే Paid Holiday, JAO సీనియారిటీ, ఆర్టిజన్లు,అన్‌మెన్,పీస్ రేటు కార్మికుల సమస్యలు మరియు కొత్త పోస్టుల భర్తీపై త్వరలో చర్యలు తీసుకుంటామని CMD హామీ ఇచ్చారు.