News February 3, 2025
నెక్కొండ: మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి

నెక్కొండ మండల కేంద్రంలో గొడవ జరుగుతుండగా అడ్డుకోబోయిన పోలీసులపై యువకులు దాడి చేశారు. మండల కేంద్రానికి చెందిన యువకులకు, ఆటో డ్రైవర్‌కు మధ్య ఆదివారం గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎంక్వయిరీ చేస్తుండగా ఇద్దరు యువకులు పోలీసులపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితులను స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 16, 2025
నర్సంపేట: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నర్సంపేట పట్టణంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. సర్వాపురానికి చెందిన గుండేటి రామస్వామి (65) రాత్రి నర్సంపేట-మహబూబాబాద్ 365వ జాతీయ రహదారి దాటుతున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 16, 2025
వరంగల్: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి ఆదేశించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలో 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 9,237 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు.
News February 15, 2025
జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్

అధికారులందరు సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.