News March 1, 2025
నెన్నెలలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నెన్నెల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి బైక్ పై తన సొంతూరు ఎల్లారం వైపు వెళ్తుండగా బొప్పారం సమీపంలోని నర్సరీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కాగా ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News March 22, 2025
కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకోవాల్సిందే: పేర్ని

AP: కూటమి ఎమ్మెల్యేలు స్కిట్లు వేసుకుని బతకాల్సిందేనని YCP నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు. ‘మా పార్టీ నేతల అరెస్టులతో జగన్ పరపతి ఏమీ తగ్గలేదు. రెడ్ బుక్ రాజ్యాంగం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే జగన్‌కే సాధ్యం. ఈ విషయంలో చంద్రబాబు, పవన్.. జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News March 22, 2025
రాజమండ్రిలలో P4పాలసీ కార్యక్రమం

P4 పాలసీ కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్ ఆధ్వర్యంలో రాజమండ్రిలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. P4 పాలసీ ద్వారా ప్రభుత్వం వెనుకబడిన కుటుంబాలను ప్రత్యక్షంగా దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. ప్రజల నిజమైన అవసరాలను తీర్చడం, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారి అభివృద్ధికి తోడ్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
News March 22, 2025
HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.