News March 21, 2025
నెన్నెల: వివాహిత మిస్సింగ్ కేసు నమోదు

నెన్నెల మండలం మైలారం గ్రామానికి చెందిన వివాహిత కంపెల మానస(22) అదృశ్యమైనట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. బుధవారం తన ఇంటి నుంచి బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిందని పేర్కొన్నారు. ఇంటికి రాకపోవడంతో భర్త నగేశ్ ఆమె తల్లిదండ్రులు అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. గురువారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Similar News
News December 17, 2025
సత్యసాయి: బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

పుట్టపర్తికి చెందిన ర్యాపిడో ఆటో డ్రైవర్ సాయి కుమార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరుపతిలో గత నెల 3న హాస్టల్ నుంచి లగేజ్ తరలిస్తూ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ పే ద్వారా నగదు చెల్లించగా ఆ నంబర్ సేవ్ చేసుకుని ప్రేమించమని వేధించేవాడు. ఈ క్రమంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదుతో మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అలిపిరి సీఐ రామకిశోర్ తెలిపారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయింపు

ఖమ్మం జిల్లా రేషన్ లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి శుభవార్త తెలిపారు. రేపటి నుంచి 22 వరకు జిల్లాలోని చౌక ధరల దుకాణాల్లో బియ్యం లభిస్తాయని ప్రకటించారు. పోర్టబిలిటీ బియ్యం కోసం జిల్లాకు 446.282 మెట్రిక్ టన్నులు కేటాయించి, షాపులకు సరఫరా చేశామని తెలిపారు. లబ్ధిదారులు ఈ తేదీల్లో వారికి సమీపంలో గల రేషన్ షాపుల నుంచి పోర్టబిలిటీ ద్వారా బియ్యం పొందాలని కోరారు.
News December 17, 2025
TTDలో కొత్త ఉద్యోగాలు..!

TTDలో త్వరలో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్వైజర్(పాచక) పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని TTD కోరింది. ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 60 పోస్ట్లను పాత నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయడానికి TTD గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.


