News April 10, 2025

నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ: ఎస్పీ జగదీష్

image

అనంత జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా ఎస్పీ జగదీష్ నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO& రేప్ కేసులు, ప్రాపర్టీ, దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ & ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, 174 Cr.P.C కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, పెండింగ్ NBWs, NDPS కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి చర్చించారు.

Similar News

News December 12, 2025

గుంతకల్లులో యువకుడి దారుణ హత్య

image

గుంతకల్లులో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆదర్శ నగర్‌లో తాగునీటి కొళాయి వద్ద నీటి కోసం మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో చంద్రశేఖర్ అనే యువకుడిపై మరో వ్యక్తి వేట కొడవలితో దాడిచేసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News December 12, 2025

టీడీపీలో చేరి కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా ఎన్నిక

image

కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా 15వ వార్డు కౌన్సిలర్ గౌతమి ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమెకు ఆర్డీఓ, ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ వసంత బాబు నియామక పత్రం అందజేశారు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన గౌతమి.. బుధవారం టీడీపీలో చేరారు. 24 మంది కౌన్సిలర్లకు గాను 22 మంది హాజరయ్యారు. ఇద్దరు గైరాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులిద్దరితో కలిపి 13 మంది గౌతమికి ఓటు వేయడంతో గెలుపొందారు.

News December 11, 2025

BREAKING: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా గౌతమి

image

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా తతలారి గౌతమి ఎన్నికయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు.