News December 4, 2024
నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లాలో జరిగిన, పెండింగ్ గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో విచారణ గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. దర్యాప్తు పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులపై సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
Similar News
News February 11, 2026
సాగర మిత్రల సేవలు కొనసాగించండి: వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో మత్స్యశాఖ కింద పని చేస్తున్న సాగర్ మిత్రల సేవలను కొనసాగించాలని కేంద్ర మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సాగర్ మిత్రులు గ్రామాలలో ఎన్నో సేవలు అందిస్తున్నారని, వారి సేవలను మరింత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2026
రేపే నెల్లూరు జిల్లాకు షర్మిల రాక

నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటన ఖారారైంది. ఆమె ఈనెల 12న ఉదయం 10 గంటలకు మనుబోలు మండలం అక్కంపేటలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం 4గంటలకు కావలిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యటన వివరాలను డీసీసీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు.
News February 11, 2026
శివరాత్రికి మైపాడు వెళ్తారా..?

మైపాడు బీచ్ వద్ద ఉన్న భారీ శివలింగం మహా శివరాత్రికి సిద్ధమైంది. సముద్ర తీరాన ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఈ లింగాన్ని తీర్చిదిద్దారు. మెట్ల ద్వారా పైకి వెళ్లి అభిషేకం చేసే సౌకర్యం ఉండటంతో.. శివరాత్రి నాడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. సముద్ర స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకునేందుకు పర్యాటకులు ఇక్కడకు ఆసక్తి చూపుతారు. ప్రకృతి ఒడిలో ఈ శివలింగం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ నిలవనుంది.


