News November 9, 2024
నెల్లికుదురులో రెండు తలలతో జన్మించిన గొర్రె పిల్ల
రెండు తలలతో గొర్రె పిల్ల జన్మించిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. నెల్లికుదురు గ్రామానికి చెందిన కావటి పిచ్చయ్య యాదవ్‌కు చెందిన గొర్రెల మందలో ఒక గొర్రెకు రెండు తలలతో వింత గొర్రె పిల్ల పుట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తండోపతండాలుగా వచ్చి దానిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా ఇది జన్యులోపమని పలువురు పేర్కొన్నారు.
Similar News
News November 14, 2024
రేపు డయల్ యువర్ ఆర్ఎం : విజయభాను
వరంగల్ రీజియన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ రీజన్ పరిధిలో బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు నెంబర్ 9959226056 కి ఫోన్ చేసి రీజియన్ లోని బస్సు సర్వీసులు, ప్రయాణికుల సర్వీసులు మెరుగుదలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.
News November 14, 2024
నర్సంపేట: పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి గడువు పెంపు
నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్‌లో చూసుకోవాలని తెలిపారు.
News November 14, 2024
వరంగల్ మార్కెట్‌లో చిరుధాన్యాల ధరల వివరాలు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల చిరు ధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయకు సోమవారం రూ.5,510 ధర రాగా.. మంగళవారం రూ.5,900, బుధవారం రూ.5550 రాగా నేడు రూ.6870 ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టి క్వింటాకి మంగళవారం రూ.2,465 ధర, బుధవారం రూ.2,480 ధర రాగా గురువారం రూ. 2440 కి పడిపోయింది. మరోవైపు పసుపు క్వింటాకి రూ.12,059 ధర పలికింది.