News January 28, 2025

నెల్లికుదురు: ఉద్యోగ ప్రకటన చూసి మోసపోయిన యువకుడు

image

నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన కాటమాల రాజు అనే యువకుడు సంవత్సరం క్రితం ఓ యాప్‌లో ఉద్యోగ ప్రకటనను చూసి సుమారుగా రూ.2.50 లక్షలు కట్టి మోసపోయినట్లు గ్రహించాడు. కొన్ని రోజుల నుంచి ఉద్యోగం ఇస్తానన్న సంస్థ ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నెల్లికుదురు పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News

News February 18, 2025

ఖమ్మం: ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం

image

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్‌ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.

News February 18, 2025

HYD: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్‌లో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు హత్యలు జరిగాయి. ఇటీవలే పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23) హత్య జరగ్గా, ఆదివారం రాత్రి వెంకటరమణ అనే వ్యక్తిని మైనర్ బాలుడు అయిన అతని అల్లుడు హత్య చేశాడు. వరుస హత్యలతో పట్టణవాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

News February 18, 2025

నిర్మల్: 3 ప్రమాదాలు.. ఐదుగురు మృతి

image

నిర్మల్ జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కాగా ఓ అనుమానాస్పద మృతి కేసు నమోదైంది. ఇందులో మూడు ఘటనలు బాసరలో జరగడం గమనార్హం. ఆర్జీయూకేటీ సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు చనిపోగా.. అదే ప్రాంతంలో మరో మృతదేహం లభ్యమైంది. పుష్కరఘాట్ల వద్ద మరొకరు నీటమునిగి చనిపోయారు. సారంగాపూర్ మండలంలో జరిగిన యాక్సిడెంట్లో ఇద్దరు దుర్మరణం చెందారు.

error: Content is protected !!