News April 25, 2024
నెల్లిమర్లలో బడ్డుకొండ అనకొండగా మారారు: చంద్రబాబు
డెంకాడ మండలంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్న సీఎం ప్రజలకు సెంట్ భూమి ఇచ్చాడంటా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రుషి కొండని మింగేస్తే బడ్డుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ అన్నారు. తంగుడుబిల్లిలో సుమారు 10 ఎకరాల కొండని అనుచరులతో అక్రమంగా తవ్వేశారని అన్నారు.
Similar News
News November 29, 2024
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
News November 29, 2024
మీ ప్రాంతంలో ధాన్యం సేకరణ ఎలా ఉంది?
విజయనగరం జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరి నూర్పులు పూర్తి కాగా పండించిన పంటను ధాన్యం కోనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాలను 250 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. మరి మీ ప్రాంతంలో ధాన్యం కొనుగోలు సేకరణ ఎలా ఉందో కామెంట్ చేయండి.
News November 29, 2024
విజయనగరం జిల్లాలో విషాదం
ఎస్.కోట మండలంలో 2 వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్.కోటకు చెందిన విశాలక్ష్మి (86) బుధవారం వంట చేస్తుండగా చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ తరలించగా అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. అదేవిధంగా వెంకటరమణ పేట గ్రామానికి చెందిన సన్నమ్మ మెట్ల నుంచి జారిపడగా మెరుగైన చికిత్స కోసం KGHకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు.