News June 14, 2024
నెల్లిమర్లలో బాలుడి హత్యకు కారణం ఇదే!
నెల్లమర్లలోని కొండపేటలో ఇటీవల జరిగిన బాలుడి హత్య కేసును ఛేదించినట్లు సీఐ రామారావు తెలిపారు. గ్రామానికి చెందిన బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి ఆన్‌లైన్‌లో ఆడేవాడు. ఆటలో గెలిచిన తర్వాత వారిని ఆటపట్టించడంతో కోపం పెంచుకున్నారు. ఈ నెల 10న మధ్యాహ్నం బాలుడిని తాటికాయల కోసం అని కొండపైకి తీసుకెళ్లారు. అక్కడే వెనుకనుంచి రాయితో కొట్టడంతో మృతిచెందాడు. నిందుతులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Similar News
News September 19, 2024
మార్చి నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాలి: హౌసింగ్ ఎండి
జిల్లాలో నిర్మాణం ప్రారంభించిన ఇళ్లన్నింటినీ మార్చి నెలాఖరులోగా శతశాతం పూర్తిచేయాలని రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎం.డి. పి.రాజాబాబు హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలను కాలవ్యవధి ప్రకారం పూర్తిచేయాలని స్పష్టంచేశారు. గురువారం జిల్లాలో పర్యటించిన ఆయన గుంకలాం తదితర ఇళ్ల కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు.
News September 19, 2024
ఆంధ్రా-ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని విస్తరించండి: ఎంపీ
ఆంధ్ర- ఒడిశా అంతర్రాష్ట్ర రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కోరారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు, కేంద్ర రోడ్డు రవాణా& హైవేస్ మంత్రికి గురువారం వినతిపత్రాలు అందజేశారు. రామభద్రపురం-రాయగడ రహదారిని విస్తరించాలని, అలాగే, ప్రస్తుతం చాలా అధ్వానంగా ఉన్న కూనేరు-రాయగడ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు.
News September 19, 2024
వెయిట్ లిఫ్టింగ్‌లో నెల్లిమర్ల యువకుడికి బంగారు పతకాలు
ఫిజి దేశంలో జరుగుతున్న కామన్ వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన వల్లూరి అజయ్ బాబు జూనియర్, సీనియర్ విభాగాల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. మొత్తం 326 కేజీల బరువును ఎత్తి ఈ ఘనత సాధించాడు. SHARE IT..