News January 27, 2025
నెల్లిమర్లలో రేపు జాబ్ మేళా

నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాధికారి ప్రశాంత్ తెలిపారు. పది, ఇంటర్, M ఫార్మసీ, B ఫార్మసీ, D ఫార్మసీ, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువతీ, యువకులు అర్హులన్నారు. వీల్స్ మార్ట్, అపోలో ఫార్మసీ, టీవీఎస్, తదితర కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయని చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
Similar News
News February 9, 2025
VZM: యువతకు జిల్లా SP కీలక సూచన

మత్తు, మాదకద్రవ్యాలకు యువత, విద్యార్థులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజ్ఞప్తి చేశారు. శనివారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు కలిగి ఉన్నా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా, పండించినా చట్టరీత్యా తీవ్ర నేరంగానే పరిగణిస్తామన్న వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. యువతను అప్రమత్తం చేసేందుకు సంకల్ప రథం ద్వారా కృషి చేస్తున్నామని మంచి జీవితాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
News February 8, 2025
VZM: జిల్లా ఎస్పీ దృష్టికి పోలీస్ సిబ్బంది సమస్యలు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సంక్షేమ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ వకుల్ జిందాల్ దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఎస్పీ పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పోలీస్ సిబ్బంది తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని స్పష్టం చేశారు.
News February 7, 2025
VZM: మన మంత్రికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

అనూహ్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి గజపతినగరం MLAగా గెలిచిన కొండపల్లి శ్రీనివాస్ చంద్రబాబు క్యాబినేట్‌లో MSME., సెర్ప్, NRI సాధికారత, సంబంధాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా కొండపల్లి మూడో ర్యాంకు సాధించారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20, సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. మరి కొండపల్లి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?