News December 6, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కుదిరిన సయోధ్య

image

భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విభేదాలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు.

Similar News

News January 14, 2026

పట్టువర్ధనంలో పండగ వేళ విషాదం

image

వంగర మండలం పట్టువర్ధనంలో బుధవారం పండగ పూట విషాదం నెలకొంది. గ్రామస్థుడు రాజు కుమార్ (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన స్నేహితులతో కలసి పడవపై మడ్డువలస రిజర్వాయర్‌లో ప్రయాణించాడు. ప్రమాదవశాత్తు మధ్యలో పడవ బోల్తా పడగా..ఈత రాక రాజు కుమార్ నీట మునిగి మృతి చెందాడు. భార్య వాణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం డెడ్ బాడీని రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టానికి తరలించారు.

News January 14, 2026

అనాథ చిన్నారులతో భోగి సంబరాలు జరుపుకున్న కలెక్టర్ దంపతులు

image

విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి దంపతులు భోగి పర్వదినాన్ని అనాథ చిన్నారులతో జరుపుకున్నారు. కె.ఎల్.పురంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శిశువుల ఆశ్రమాన్ని తన సతీమణితో బుధవారం సందర్శించి శిశుగృహంలో చిన్నారులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు.

News January 14, 2026

తెలుగు సాంప్రదాయాలను కాపాడాలి: ఎమ్మెల్యే బేబినాయన

image

తెలుగు సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బాడంగి మండలం గజరాయునివలసలో బుధవారం ఎద్దులతో బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైతులకు బండ లాగుడు పందెం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 15 గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.