News December 6, 2024

నెల్లిమర్ల ఎమ్మెల్యేతో కుదిరిన సయోధ్య

image

భోగాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవితో నియోజకవర్గ కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ విభేదాలు సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా వెళ్లాయి. ఈ నేపథ్యంలో వీరి కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. కలిసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు.

Similar News

News November 12, 2025

VZM: హోంగార్డ్స్ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు

image

2023-24 విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన 16మంది హెూంగార్డ్స్ పిల్లలకు రూ.2000 చొప్పున మెరిట్ స్కాలర్‌షిప్‌లు జిల్లా ఎస్పీ దామోదర్ తన కార్యాలయంలో నేడు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉన్నత విద్యతోనే భవిష్యత్తు బలపడుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువులో రాణించాలని సూచించారు. హెూంగార్డ్స్ సంక్షేమం కోసం ఇలాంటి ప్రోత్సాహకాలు కొనసాగుతాయని తెలిపారు.

News November 12, 2025

ప్రతీ మండలంలో వెయ్యి మందికి ఉపాధి పనులు: VZM కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఉపాధి పనులపై జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన డ్వామా, ఏపీడీలు, MPDOలు, ఏపీవోలతో మండలాల వారీగా సమీక్షించారు. మెంటాడ, రామభద్రపురం, సంతకవిటి, రాజాం, కొత్తవలస, భోగాపురం, గుర్ల మండలాలు పనిదినాల కల్పనలో వెనుకబడ్డాయని, 1000 మంది శ్రామికులకు పని కల్పించాలన్నారు.

News November 12, 2025

VZM: ‘రుణాల రికవరీ వందశాతం ఉండాలి’

image

రుణాల రికవరీ వందశాతం ఉండాలని DRDA పీడీ శ్రీనివాస్‌ పాణి ఆదేశించారు. స్థానిక DRDA కార్యాలయంలో ‘మన డబ్బులు.. మన లెక్కలు’ కార్యక్రమంపై మంగళవారం సమావేశం నిర్వహించారు. రుణాల లక్ష్యాన్ని సిబ్బంది చేరుకోవాలని కోరారు. గ్రామ స్థాయి సిబ్బందితో సమన్వయం తప్పనిసరిగా ఉండాలన్నారు. మహిళల ఆర్థికాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. కార్యక్రమంలో APD సావిత్రి, DPMలు చిరంజీవి, లక్ష్మీ నాయుడు పాల్గొన్నారు.