News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.
Similar News
News April 20, 2025
గంట్యాడ: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి

గంట్యాడ మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు. ఆదివారం ఉదయం ట్రాక్టర్ డ్రైవర్ వర్రి రామారావు (50) గ్రావెల్ లోడుతో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మదనాపురం రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి రామారావు తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
VZM: మహిళ దారుణ హత్య

విజయనగరం జిల్లాకు చెందిన మహిళ రణస్థలంలో దారుణ హత్యకు గురైంది. పూసపాటిరేగ మం. పెద్ద పతివాడకి చెందిన భవాని (26) భర్తతో కలిసి పైడిభీమవరం పంచాయతీ గొల్లలపేటలో ఉంటోంది. పైడిభీమవరంలోని ఓ హోటల్లో పని చేస్తున్న భవాని శనివారం సాయంత్రం ఇంటికి వస్తుండగా చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News April 20, 2025
DSC: ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ 10 గంటలకు మెగా DSC నోటిఫికేషన్ వెలువడనుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ➱SA LANG-1: 14, ➱HINDI: 14, ➱ENG: 23, ➱MATHS: 08, ➱PS: 32, ➱BS: 20, ➱SOCIAL: 62, ➱PE:63, ➱SGT: 210, ➱TOTAL: 446 ఉన్నాయి. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ➱ENG:07, ➱MATHS:25, ➱PS:24, ➱BS:16, ➱SOCIAL:05, ➱SGT: 60, ➱TOTAL:137 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.