News June 5, 2024

నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే

image

నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్‌వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009,19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

Similar News

News September 29, 2024

కురుపాంలో యాక్సిడెంట్.. ఇద్దరు స్పాట్‌డెడ్

image

కురుపాం మండలం వలసబల్లేరు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని నీలకంఠపురం SI తెలిపారు. ఘటనలో బిడ్డిక జూజారు, బిడ్డిక శ్రీను మృతిచెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News September 29, 2024

100 జిల్లాల్లో విజయనగరానికి స్థానం

image

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ జ‌న్ జాతీయ ఉన్న‌త్ గ్రామ్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి అక్టోబ‌రు 2న ఆన్‌లైన్ వర్చువల్‌గా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆదివారం తెలిపారు. ఆదిమ గిరిజ‌న తెగ‌ల వారు నివ‌సించే దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. అందులో విజ‌య‌న‌గ‌రం జిల్లా కూడా ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

News September 29, 2024

విజయనగరం జిల్లాలో టెట్ పరీక్షా కేంద్రాలివే

image

అక్టోబర్ 3 నుంచి 21 వరకు (11, 12 తేదీలు మినహాయించి) జిల్లాలో టెక్ పరీక్ష జరగనుంది. కలువరాయి, చింతలవలస, కొండకారకం, గాజులరేగ, జొన్నాడ కేంద్రాలలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు తిరిగి మరల 2.30 నుంచి సాయంత్రం 5 వరకు అన్ లైన్ పరీక్ష జరగనుంది.
పరీక్షకు హాజరయ్యేవారు గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు.